ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం

ABN , First Publish Date - 2023-01-25T00:36:17+05:30 IST

మండల కేంద్రంలోని ఎంపీపీ ఎస్‌ మెయిన్‌ పాఠశాలలో మం గళవారం ఎంఈవో రంగస్వామి ఆధ్వర్యంలో, కేపీఆర చారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపకులు రామ్మో హన్‌ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిం చారు

ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం
దేవనకొండలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈవో

దేవనకొండ, జనవరి 24: మండల కేంద్రంలోని ఎంపీపీ ఎస్‌ మెయిన్‌ పాఠశాలలో మం గళవారం ఎంఈవో రంగస్వామి ఆధ్వర్యంలో, కేపీఆర చారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపకులు రామ్మో హన్‌ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు విద్యార్థు లకు నోటు పుస్తకాలు, పెన్నులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఎస్‌ఎండీ బాషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆదోని(అగ్రికల్చర్‌): ఆడపిల్లల రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత అని సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాల్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల జనరల్‌ పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం వస్తేనే ఆడపిల్లల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. పురుషులతో సమానంగా విస్తృత అవకాశాలు మహిళలకు ఉన్నాయని తెలిపారు. ఇస్వీ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ విజయలక్ష్మి మాట్లాడుతూ ఆడపిల్ల చదువుతోనే ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుందన్నారు. బాల్య వివాహాలు నేరమని, మహిళలకు ఎన్నో చట్టాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కో-ఆర్డినేటర్‌ మారుతి, సీఎంవో రాజేశ్వరి, ప్రిన్సిపాల్‌ శాంతి, అంజలి పాల్గొన్నారు.

కౌతాళం: ఆడపిల్లల చదువు సమాజానికే వెలుగు అని ఐసీడీఎస్‌ పర్య వేక్షకులు లీలావతి, శివలింగమ్మ, గోవిందమ్మ, జయలక్ష్మి, పద్మ అన్నారు. కౌతాళంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో మంగళవారం గ్రామ సర్పంచ్‌ పాల్‌దినకరన్‌, గ్రామ నాయకుడు ప్రహ్లాదాచారిలతో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ మార్పునకు ఆడపిల్లల చదువు ఎంతో అవసరమని అన్నారు. అనంతరం విద్యార్థినులకు వ్యాసరచన పోటీలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి పరీక్ష ప్యాడ్‌లను అందజేశారు. బాలికలందరికీ పెన్నులను అందజేశారు. అనంతరం జాతీయ బాలిక వారోత్సవ ర్యాలీని నిర్వహించారు.

మంత్రాలయం: బాలికల హక్కులపై అవగాహన కల్పించాలని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ నాగలక్ష్మి అన్నారు. మంత్రాలయంలో జాతీయ బాలికా దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పంచా యతీ కార్యాల యం నుంచి సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహిం చారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివా హాల నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో అంగ న్‌వాడీ టీచర్లు స్వప్న, భీమే శ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:36:17+05:30 IST