Share News

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:55 AM

ఆలూరు మండలంలో సోమవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు
ఆలూరు సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు

ఆలూరు, డిసెంబరు 25: ఆలూరు మండలంలో సోమవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలూరు సీఎస్‌ఐ, అర్‌సీఎం, హోసన్న చర్చిలతోపాటు మొలగవల్లి కొట్టాల, హత్తి బెళగల్‌, ముద్దనగేరి, కురుకుంద గ్రామాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. క్రీస్తు జననం సర్వలోక మానవాళికి ఆనందదాయకమని పాస్టర్‌ బెనోహర్‌, శ్యామ్‌, ఏసన్న అన్నారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి దేవదానం, సభ్యులు ఎసురత్నం, జాన్‌, విజయ్‌, రాజన్న, సుందర్‌ పాల్గొన్నారు.

ఆదోని టౌన్‌: కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం కిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గం ఇన్‌చార్జి నీలకంఠ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలి పారు. శాంతి, సహనం, ప్రేమలను బోధించే యేసుక్రీస్తు జీవితమే అంద రికీ ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీరావు, పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షుడు దిలీప్‌ ధోక పటణ కార్యదర్శి సాయినాథ్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవిశెట్టి వీరేష్‌, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు సుంకన్న, మాణిక్యరాజ్‌, రామన్న యాదవ్‌, మద్దిలేటి, మోహన్‌ రెడ్డి, హుసేన్‌, రాము పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు/రూరల్‌: క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. కలుగొట్ల రోడ్డులోని ఎంబీ చర్చి, ఆరీసీఎం, క్రిస్టియన్‌ అసెంబ్లీ, బేతేలు ప్రార్థనా మందిరం, సెయింట్‌ ఆడ్రూస్‌ సీఎస్‌ఐ టౌన్‌ చర్చి, సీఆర్‌సీ చర్చిలతో పాటు ఆయా ప్రాంతాల్లో వెలసిన చర్చిల్లో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎంబీ చర్చిలో మాజీ ఎమ్మెల్యే జయనా గేశ్వరరెడ్డి, వైసీపీ సీనియర్‌ నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి, వీరశైవలిం గాయత్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వై రుద్రగౌడ్‌లు ప్రార్థనల్లో పాల్గొని శుభాకాంక్ష లు తెలిపారు. వీరిని చర్చి సంఘపెద్దలు సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

పత్తికొండ టౌన్‌: పత్తికొండ పట్టణంలో సోమవారం క్రిస్మస్‌ను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్‌ వేడుకలను పురస్కరించుకుని స్థానిక బేతస్త ప్రార్థన మందిరంలో క్రైస్తవులు ప్రార్థనలు జరిపి, కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో పోచంరెడ్డి సేవాదల్‌ వ్యవస్థాపకులు మురళీధర్‌ రెడ్డి, క్రైస్తవులు సాలు రంగడు, క్రైస్తవులు పాల్గొన్నారు.

గోనెగండ్ల: మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో సోమవారం క్రిస్టియన్‌లు క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గోనెగండ్ల, హెచ్‌ కైరవాడి, గాజులదిన్నె, కులుమాల, వేముగోడు, పుట్టపాశం, గంజహళ్లి, అగ్రహరం, బైలుప్పల, అలువాల, చిన్నమరివీడు, పెద్దమరివీడు, పెద్దనూ లటూరు, చిన్ననేలటూరు, తప్పనూరు, ఎర్రబాడు, పిల్లిగుండ్ల, నెరుడుప్పల గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలు ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. ప్రార్థన కార్యక్రమంలో మహిళలు, యువకులు, పిల్లలు పాల్గొన్నారు.

కౌతాళం: మండలంలో సోమవారం క్రైస్తవులు క్రిస్‌మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా మండల కేంద్రంతో పాటు ఎరిగేరి, ఉరుకుంద, కామవరం, హల్వి, బదినేహల్‌ గ్రామాల్లోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిల్లో పిల్లలకు ఆటల పోటీలను నిర్వహించి తగిన ప్రోత్సాహకాలను అందజేశారు.

నందవరం: మండల కేంద్రంతో పాటు పలుగ్రామాల్లో సోమవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నందవరం, నాగలదిన్నె, పూల చింతల, హలహర్వి, నదికైరవాడి, మిట్టసోమాపురం, ముగతి, గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలు ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. నందవరం చర్చిలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మాధవరావు దేశాయి కేక్‌ కట్‌ చేశారు.

పెద్దకడబూరు: మండల కేంద్రమైన పెద్దకడబూరుతో పాటు జాలవాడి, కంబళదిన్నే, మురవణి, బసలదొడ్డి, అయా గ్రామాల్లో క్రైస్తవులు క్రిస్మస్‌ను ఘనంగా జరుపుకున్నారు. పెద్దకడబూరులోని చర్చిలో టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి తిక్కారెడ్డి, తెలుగు రాష్ట్ర రైతు సంఘం అధికార ప్రతినిధి రమాకాంత్‌ రెడ్డి పాల్గొని రేఫరండం పాస్టర్‌ మనోహర్‌ బాబుతో కలిసి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ బసలదొడ్డి ఈరన్న, గోపాల్‌ రెడ్డి, ఏస్సీ సెల్‌ జిల్లా నాయకులు ఏసేబు, మల్లికార్జున, బొగ్గుల నరసన్న పాల్గొన్నారు .

Updated Date - Dec 26 , 2023 | 12:55 AM