వైభవంగా స్వాతి వేడుకలు
ABN , First Publish Date - 2023-12-10T23:40:20+05:30 IST
అహోబిలం లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలను ఆదివారం అర్చకులు వైభవంగా నిర్వహించారు.
ఆళ్లగడ్డ, డిసెంబరు 10: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలను ఆదివారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున్నే ఉత్సవమూర్తులైన ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం దిగువ అహోబిలంలో 108 కలశాలతో సుదర్శన హోమాన్ని నిర్వహించారు. స్వాతి నక్షత్రాన్ని పురష్కరించుకొని నవనారసింహ క్షేత్రాలలో అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు.