ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధం కావాలి

ABN , First Publish Date - 2023-06-03T00:49:01+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికుల సమస్య లను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధం కావాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం పిలు పునిచ్చారు.

ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధం కావాలి
మాట్లాడుతున్న నాగభూషణం

ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం

కర్నూలు(న్యూసిటీ), జూన్‌ 2: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికుల సమస్య లను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధం కావాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం పిలు పునిచ్చారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హిందూపురంలో ప్రారంభమైన బస్సు యాత్ర శుక్రవారం కర్నూలు నగరానికి చేరుకుంది. అశోక్‌నగర్‌లో జరిగిన సభలో నాగభూషణం మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాక ముందు కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేస్తానని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలైందన్నారు. క్లాప్‌ డ్రైవర్లకు రూ.9 వేల మాత్ర మే జీతం ఇస్తున్నారని, రూ.18,500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల సంఖ్యను పెంచి కార్మికు లపై పనిభారం తగ్గించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ అంజిబాబు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ పి.నిర్మల, ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకులు ముత్యాలరావు, నాగరాజు, లక్ష్మీనారా యణ, సీఐటీయూ జిల్లా అధ్య క్షుడు పీఎస్‌.రాధాక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:49:01+05:30 IST