విజయ థియేటర్‌లో అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2023-05-28T23:21:54+05:30 IST
డోన్ పట్టణంలోని పాత విజయ థియేటర్‌లో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి.
డోన్(రూరల్), మే 28: డోన్ పట్టణంలోని పాత విజయ థియేటర్‌లో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. విజయ థియేటర్ గత కొంత కాలంగా మూతపడి ఉంది. దీంతో కొందరు ఆకతాయీలకు థియేటర్ పరిసర ప్రాంతం అడ్డాగా మారినట్లు తెలుస్తోంది. టీడీపీ నాయకులు మర్రి రమణకు చెందిన విజయ థియేటర్‌లో మంటలు చెలరేగడంతో కలకలం రేపింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో హుటాహుటిన థియేటర్ లోపలి భాగంలో చెలరేగిన మంటలను రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. థియేటర్ లోపల చెత్తాచెదారం ఎక్కువ కావడం, ఎవరైనా ఆకతాయీలు అక్కడ బీడి, సిగరెట్ వంటివి సేవిస్తూ వాటిపై పారివేయడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. రూ.30వేలకు పైగా నష్టం జరిగి ఉండవచ్చని డోన్ అగ్నిమాపక శాఖ అధికారి రంగస్వామి గౌడు తెలిపారు.