పత్తి ధర పతనం
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:05 AM
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి.
క్వింటం రూ.7051
ఆదోని (అగ్రికల్చర్), డిసెంబరు 28 : ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. గత వారం రోజులతో పోలిస్తే క్వింటానికి రూ.200 వరకు ధర తగ్గింది. రైతులు పంట చేతికొచ్చినప్పటి నుంచి పత్తి ధర పెరుగుతుందని ఆశించారు. పెరగకపోవడం అటుంచి తగ్గుతుండడంతో ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వమే మద్దతు ధర రూ.10 వేలకు పైగా చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2335 క్వింటాళ్ల పత్తి దిగుబడి విక్రయానికి రాగా, కనిష్ఠ ధర రూ.4711 గరిష్ఠ ధర రూ.7051, మధ్యస్థ ధర రూ.6859 పలికింది.