సీఎం పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన
ABN , First Publish Date - 2023-05-26T00:16:33+05:30 IST
ముఖ్యమంత్రి ఈనెల 30న పత్తికొండకు రానుం డడంతో అధికారులు అడుగడుగునా పరిశీలిస్తున్నారు.

పత్తికొండ, మే 25: ముఖ్యమంత్రి ఈనెల 30న పత్తికొండకు రానుం డడంతో అధికారులు అడుగడుగునా పరిశీలిస్తున్నారు. గురువారం జాయిం ట్ కలెక్టర్ మౌర్య, స్పెషల్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓ మోహన్‌దాస్‌తో కలిసి జూనియర్ కాలేజి క్రీడా మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు పరిశీ లించారు. బస్సు యాత్ర సాగే రహదారిని పర్యవేక్షించారు. పట్టణంలో రహ దారి గుంతలమయంగా ఉండటంతో కొత్త రహదారిని ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.