కరువు సహాయక చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2023-09-20T00:07:31+05:30 IST

రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం వల్ల కరువు ఛాయలు నెలకొన్నప్పటికీ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవతుఉన్నారని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు.

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

20 నుంచి సచివాలయాల్లో వినతులు

25న మండల కేంద్రాల్లో ధర్నాలు: రైతు, వ్యవసాయ కార్మిక సంఘం

నందికొట్కూరు, సెప్టెంబరు 19: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం వల్ల కరువు ఛాయలు నెలకొన్నప్పటికీ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవతుఉన్నారని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో రైతు సంఘం నాలుగు మండలాల బాధ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్న అన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కూలీలు, పేద రైతుల జీవనోపాధి ఉపాధి హామీ పథకం కింద మరో 100 రోజులు అదనంగా పనులు కల్పించాలని, కరువు సహాయం కింద ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఈ నెల 20 నుంచి 25 వరకు సచివాలయాల్లో వ్యక్తిగత అర్జీలను ఇవ్వాలని, 25న తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నాలు చేపట్టాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బెస్తరాజు, పక్కీర్‌ సాహెబ్‌, రామకృష్ణ, రమణయ్య, ఏసన్న, లింగన్న, రామిరెడ్డి, నాగభూషణం, నరసింహుడు, శేఖర్‌, హరినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-20T00:07:31+05:30 IST