జిల్లాను ఎడారిగా మార్చకండి

ABN , First Publish Date - 2023-06-26T00:12:47+05:30 IST

కర్నూలు జిల్లాను ఎడారిగా మార్చరాదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల అన్నారు.

జిల్లాను ఎడారిగా మార్చకండి

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల

కర్నూలు(న్యూసిటీ), జూన్‌ 25: కర్నూలు జిల్లాను ఎడారిగా మార్చరాదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల అన్నారు. ఆదివారం కార్మిక కర్షక భవన్‌లో జరిగిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం వచ్చాక కర్నూలు జిల్లా ఎడారిగా మారిందన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి పట్ల ప్రభుత్వానికి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదన్నారు. జిల్లాలో ఒక్క పరిశ్రమ కూడా లేకపోవడంతో నిరుద్యోగులంతా హైదరాబాదు, బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో గుండ్రేవుల, వేదవతి, నగరడోన రిజర్వాయర్‌లాంటి ప్రాజెక్టులు నిర్మిస్తే జిల్లా సాగు, తాగునీటి రంగాలలో సస్యశ్యామలమ వుతుంద న్నారు. జగన్‌ ప్రభుత్వం ప్రజలకు బటన్‌ నొక్కి తాయిళాలు ఇవ్వడం తప్ప అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వం అప్పర్‌భద్ర ప్రాజెక్టు నిర్మిస్తున్నా ప్రభుత్వం చలనం లేకుండా ఉందని మండిపడ్డారు. జిల్లా సమగ్రాభివృద్ధి, పరిశ్రమల స్థాపన కోసం జరిగే పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నగర కార్యదర్శి టి.రాముడు, సీహెచ్‌ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:12:47+05:30 IST