రాజగోపుర నిర్మాణానికి రూ.లక్ష విరాళం
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:53 AM
ఉరుకుంద ఈరన్న స్వామి రాజగోపురానికి సోమవారం ఓ భక్తుడు రూ.లక్ష విరాళంగా అందించి నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వాణి తెలిపారు.
కౌతాళం, డిసెంబరు 25: ఉరుకుంద ఈరన్న స్వామి రాజగోపురానికి సోమవారం ఓ భక్తుడు రూ.లక్ష విరాళంగా అందించి నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వాణి తెలిపారు. పత్తికొండ గ్రామ వాస్తవ్యులు ఇల్లూరి నాగరాజు కుటుంబ సభ్యులు రూ.1,01,116 నగదును దేవాలయ కార్యాలయంలో అందజేసినట్లు తెలిపారు. దాతలకు ఆలయ అధికారులు స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేపట్టి స్వామి వారి శేషవస్త్రాలు, ఫలపుష్పాలను అందజేశారు.