వైసీపీ ప్రభుత్వానికి రోడ్లు పట్టవా?
ABN , First Publish Date - 2023-11-20T00:41:43+05:30 IST
రాష్ట్రంలో గుంతలుపడిన రోడ్లు వైసీపీ ప్రభుత్వానికి కనిపించడం లేదా ? అని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ ప్రశ్నించారు.

నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్
ఓర్వకల్లు, నవంబరు 19: రాష్ట్రంలో గుంతలుపడిన రోడ్లు వైసీపీ ప్రభుత్వానికి కనిపించడం లేదా ? అని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ ప్రశ్నించారు. ఆదివారం గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారే దీ కార్యక్రమాన్ని జనసేనతో కలిసి టీడీపీ నాయకులు నిర్వహించారు. అనంతరం ఆయన మండలలోని హుశేనాపురం, ఉప్పలపాడు గ్రామాల మధ్య అధ్వానంగా ఉన్న రోడ్డును చూపుతూ సెల్ఫీ చాలెంజ్ చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ వైసీపీ నాయకులకు ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప.. ప్రజా సదుపాయాలపై ధ్యాసే లేదన్నారు. మండలం లోని బ్రాహ్మణపల్లె, శకునాల, లొద్దిపల్లె, భైరాపురం, సోమయాజులపల్లె, కొమరోలు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లను కోట్లాది రూపాయలతో రోడ్లు వేశామని, వైసీపీ మరమ్మతులు కూడా చేయలేని దుస్థితి ఏర్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయ కులు సుధాకర్, రామగోవిందు, నాగరాజు, వేణు, కేవీ మధు, బజారు, జయకృష్ణ, బువ్వ రవికుమార్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.