Share News

పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:57 PM

నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహించరాదని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేష న్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గంధం చంద్రుడు అన్నారు.

పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌

కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 18: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహించరాదని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేష న్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గంధం చంద్రుడు అన్నారు. స్వచ్ఛభారత్‌ 2.0లో భాగంగా చేపడుతున్న వివిధ ప్రాజెక్టులను సోమవారం ఆయన కమిష నర్‌ భార్గవ తేజతో కలిసి పరిశీలించారు. ముందుగా గార్గేయపురం వద్ద నగర పాలక సాలిడ్‌ వేస్ట్‌ మెనేజ్‌మెంట్‌ ప్లాంట్‌, జొహరాపురం వద్ద భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను పరిశీలించారు. అనంతరం నగరంలోని ఒకటో వార్డులో పర్యటించి ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చెత్త సేకరణ సరిగా జరగడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆయన వెంట మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ కే.విశ్వేశ్వరరెడ్డి, ఈఈ షాకీర్‌ హుస్సేన్‌, ఏఈ దినేష్‌ ఉన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:57 PM