Share News

గోనెగండ్లలో జిల్లా స్థాయి భజన పోటీలు

ABN , First Publish Date - 2023-10-30T23:45:32+05:30 IST

గోనెగండ్లలో చింతలాముని నల్లారెడ్డి స్వాముల వారి మాస పూజల సందర్భంగా జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.

 గోనెగండ్లలో జిల్లా స్థాయి భజన పోటీలు

గోనెగండ్ల, అక్టోబరు 30: గోనెగండ్లలో చింతలాముని నల్లారెడ్డి స్వాముల వారి మాస పూజల సందర్భంగా జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. మాస పూజలు నవంబరు 2న జరుగుతుందన్నారు. భజన పోటీలు కూడా ఆదే రోజు రాత్రి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 30 తులాల వెండిని, రెండో బహుమతి 20 తులాలు, మూడో బహుమతి 15 తులాల వెండి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే వారు 9553636720, 9885637504లను సంప్రదించాలని కోరారు.

Updated Date - 2023-10-30T23:45:32+05:30 IST