రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన
ABN , First Publish Date - 2023-09-26T01:10:07+05:30 IST
రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన కొనసాగుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

టీడీపీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన
కర్నూలు(అగ్రికల్చర్), సెప్టెంబరు 25: రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన కొనసాగుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు ఽధర్నా చౌకు వద్ద సోమవారం నల్లబెలూన్లను ఎగురవేసి కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సోమిశెట్టి మాట్లాడుతూ చంద్ర బాబుకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక జైలుకు పంపా రన్నారు. కార్యక్రమంలో సోమిశెట్టి నవీన్, ఎస్.అబ్బాస్, నాగరాజు యాదవ్, సంజీవలక్ష్మి, రాజ్యలక్ష్మి, ముంతాజ్, సత్రం రామకృష్ణుడు, గున్నామార్క్, రా మాంజినేయులు, నాగేశ్వరరావు, తిరుపాలుబాబు, పరమేష్, అకిల్ పాల్గొన్నారు.
కోడుమూరు: టీడీపీ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్ ఆధ్వర్యంలో కోడుమూ రులో చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారానికి 13వ రోజుకు చేరుకొంది. మాజీ సర్పంచు సీబీలత అధ్యక్షతన చేనేత కార్మికులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. చంద్రబాబుకు అక్రమ అరెస్టును ఖండిస్తూ ముందుగా కోట్ల సర్కిల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈసందర్భంగా ఆకెపోగు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచు భాగ్యరత్న, టీడీపీ సీనియర్ నాయకులు కేఈ మల్లికార్జునగౌడ్, మాజీ సర్పంచు కేఈ రాంబాబు, టీడీపీ కోడుమూరు, గూడూరు కన్వీనర్లు కోట్ల కవితమ్మ, ఎల్.సుధాకర్‌రెడ్డి, గజేంద్ర గోపాల్‌నాయుడు, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు హేమాద్రిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, దండు సుందర్‌రాజు, ఎల్లప్పనాయుడు, ఎమార్పీఎస్ నాయకులు ఆంధ్రయ్య పాల్గొన్నారు.