రాక్షస పాలనకు అంతం తప్పదు: కేఈ శ్యాంబాబు
ABN , First Publish Date - 2023-01-18T00:38:08+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ రాక్షస పానలకు అంతం తప్పదని పత్తికొండ టీడీపీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు.
తుగ్గలి, జనవరి 17: రాష్ట్రంలో వైసీపీ రాక్షస పానలకు అంతం తప్పదని పత్తికొండ టీడీపీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. మంగళవారం మండ లంలోని జి.ఎర్రగుడిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తున్నదని, ప్రజలు ఒక్క చాన్స్ ఇవ్వడంతో సీఎం జగన్ రాష్ట్ర పురోగతిని అథోగతి పాలు చేశారని అన్నారు. వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్తిన వెంకటరాముడు, టీడీపీ నాయకులు వెంకటస్వామి, చంద్ర శేఖర్ యాదవ్, మనోహర్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.