రాష్ట్రంలో రాక్షస పాలన’
ABN , First Publish Date - 2023-10-04T00:47:42+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన కొనసా గిస్తుందని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు.
ఆదోని, అక్టోబరు 3: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన కొనసా గిస్తుందని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద రిలే దీక్షలు నిర్వహిం చారు. దీక్షల్లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ నరసింహులు, మహదేవ, ఉరుకుందు, కేప్ప, సూరి, సూరి, మహాదేవ, మస్తాన్, రవి, గోవిందప్ప కూర్చున్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మా ట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా అరెస్టు సీఎం జగన్ రాక్షస ఆనందం పొందుతున్నా రన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర నాయకులు మారుతి నాయుడు, వెంకటేష్ చౌదరి, సిద్ధార్ధ నాయుడు, సాకరే మారుతిరావు, రామస్వామి, బుద్ధారెడ్డి, బ్రహ్మ, లక్ష్మీనారాయణ, మాభాష, బిచ్చే అంజన్నప్ప, రంగన్న, కృష్ణారెడ్డి, విరుపాక్షి, వీరేష్, పెద్ద తులం నాగరాజ్, షరీఫ్, ఉరుకుందు, గోవిందప్ప పాల్గొన్నారు.