గుర్తు తెలియని వాహనం ఢీ - వ్యక్తి మృతి
ABN , Publish Date - Dec 14 , 2023 | 12:33 AM
మండలంలోని శిరుగుప్ప ప్రధాన రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృత్యువాత పడ్డాడు.
ఆదోని రూరల్, డిసెంబరు 13 : మండలంలోని శిరుగుప్ప ప్రధాన రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృత్యువాత పడ్డాడు. మంగళవారం రాత్రి శిరుగుప్ప రోడ్డు సంతేకూడ్లూరు సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడని, గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం ఉందని, ఈ మృతుడి ఒంటిపై గోధమ రంగు టీ షర్టు, నీలం కలరు లూంగీ ఉందని అన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చూరీకి తరలించామని ఇస్వీ ఎస్.ఐ శ్రీనివాసులు తెలిపారు.