ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
ABN , First Publish Date - 2023-05-25T23:43:21+05:30 IST
మండలంలోని అంబాపురం గ్రామానికి చెందిన ఒక యువకుడికి కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు.

బేతంచెర్ల, మే 25: మండలంలోని అంబాపురం గ్రామానికి చెందిన ఒక యువకుడికి కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. ఎస్‌ఐ శివశంకర్ నాయక్ తెలిపిన వివరాలివీ.. అంబాపురం గ్రామానికి చెందిన గోరంట్లగారీ శివకృష్ణకు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని 2021లో కర్నూలు నగరానికి చెందిన సయ్యద్ సద్దాం హుశేన్ అనే వ్యక్తి రూ.2 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం గురించి అడిగితే.. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. మోసపోయానని భావించిన యువకుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.