Share News

ఉద్యోగులను గాలికొదిలేసిన వైసీపీ

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:44 AM

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల సమ స్యలను గాలికొదిలేసిందని టీడీపీ కర్నూ లు ఇన్‌చార్జి టీజీ భరత్‌ ధ్వజమెత్తారు.

ఉద్యోగులను గాలికొదిలేసిన వైసీపీ

టీడీపీ కర్నూలు ఇన్‌చార్జి టీజీ భరత్‌

రాజ్‌విహార్‌ సర్కిల్‌లో ఉద్యోగుల మానవహారం

కర్నూలు(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 29: వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల సమ స్యలను గాలికొదిలేసిందని టీడీపీ కర్నూ లు ఇన్‌చార్జి టీజీ భరత్‌ ధ్వజమెత్తారు. ఎస్‌ఎస్‌ఏలో కాంట్రాక్టు కింద పని చేసే ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, పార్ట్‌ టైమ్‌ ఉద్యోగులను కాంట్రాక్టు కిందకు మార్చి ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని కోరుతూ ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి పదో రోజుకు చేరింది. ధర్నా చౌక్‌ నుంచి రాజ్‌విహార్‌ వరకు ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు ర్యాలీగా వచ్చి మానవహారం నిర్వహించారు. దర్నా చౌక్‌ వద్ద టీజీ భరత్‌ వీరికి మద్దతు తెలిపి మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబుతో మాట్లాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ నాయ కులు చంద్రశేఖర్‌ రాజు, జే.నాగేశ్వరరావు, నాగరత్నమ్మలు మాట్లాడుతూ ఉద్యో గుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జడ్పీ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్‌, జనసేన నాయకులు హర్షవర్దన్‌, కేజీబీవీ టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు, ఎంఐసీ కోఆర్డినేటర్లు, పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:44 AM