మిసెస్ సౌత్ ఇండియాగా చాగలమర్రి మహిళ
ABN , First Publish Date - 2023-01-21T00:12:24+05:30 IST
చాగలమర్రి గ్రామానికి చెందిన ఎస్.చరిత సుమాలిని మిసెస్ సౌత్ ఇండియా ఎంపికయ్యారు. థామస్ ఆనంద్, నీరజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె ఎస్.చరిత సుమాలినికి తొమ్మిదేళ్ల క్రితం కెమికల్ ఇంజనీరింగ్‌గా విధులు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డకు చెందిన మధుబాబుతో వివాహమైంది.
చాగలమర్రి, జనవరి 20: చాగలమర్రి గ్రామానికి చెందిన ఎస్.చరిత సుమాలిని మిసెస్ సౌత్ ఇండియా ఎంపికయ్యారు. థామస్ ఆనంద్, నీరజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె ఎస్.చరిత సుమాలినికి తొమ్మిదేళ్ల క్రితం కెమికల్ ఇంజనీరింగ్‌గా విధులు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డకు చెందిన మధుబాబుతో వివాహమైంది. వీరు ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లైందని ఎస్.చరిత సుమాలిని వంట గదికే పరిమితం కాకుండా తనకున్న ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ షోకు దరఖాస్తు చేసుకున్నారు. ఫరెవర్‌స్టార్ ఇండియా సంస్థ జైపూర్‌లో డిసెంబరులో నిర్వహించిన మిసెస్ సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. పెళ్లైన మహిళలకు నిర్వహించే ఈ మిసెస్ సౌత్ ఇండియా పోటీల్లో ఆమె గెలుపొందినట్టు గురువారం ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తన భర్త మధుబాబు ప్రోత్సాహంతోనే ఈ అవార్డు సాధించగలిగానని చరిత సుమాలిని పేర్కొన్నారు.