పశువుల గుడిసె దగ్ధం
ABN , First Publish Date - 2023-10-30T00:20:01+05:30 IST
ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలోని రైతు విజయభాస్కరరెడ్డికి చెందిన పశువుల గుడిసె శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదానికి గురై కాలి బూడిదైంది.
అగ్ని ప్రమాదంలో రూ. 5 లక్షల ఆస్తి నష్టం
ఆత్మకూరురూరల్, అక్టోబర్ 29 : ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలోని రైతు విజయభాస్కరరెడ్డికి చెందిన పశువుల గుడిసె శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదానికి గురై కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు తెలిపారు. రైతు విజయభాస్కరరెడ్డికి తన ఇంటి సమీపంలోనే ఉన్న కల్లంలోని గుడిసెలో పశువులను కట్టేశారు. వ్యవసాయ పనిముట్లు, రెండు గడ్డి వాములు అక్కడ ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు గుడిసెలో మంటలు చెలరేగి, చుట్టు పక్కల ఉన్న గడ్డి వాములకు మంట లు వ్యాపించాయి. గ్రామస్థులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా... గుడిసె, రెండు బర్రెలు, రెండు దూడలు, రెండు గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.