భక్తజన మంత్రాలయం

ABN , First Publish Date - 2023-05-26T00:23:32+05:30 IST

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం గురువారం జనసంద్రమైంది. రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిశాయి.

భక్తజన మంత్రాలయం

రాఘవేంద్రుడి సన్నిధిలో భక్తుల రద్దీ

మంత్రాలయం, మే 25: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం గురువారం జనసంద్రమైంది. రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిశాయి. గురువారం రాఘవేంద్ర స్వామికి ప్రీతిపాత్రమైన రోజు కావటంతో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి దాదాపు 80 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చినట్లు అధికారులు అంచనా వేస్త్తున్నారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నది తీరం భక్తులతో కోలాహలంగా మారింది. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మను భక్తులు దర్శించుకున్న తర్వాత రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవంలో పాల్గొని పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆశీర్వచనం పొందారు.

Updated Date - 2023-05-26T00:23:32+05:30 IST