Share News

వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం

ABN , Publish Date - Dec 22 , 2023 | 12:03 AM

ప్రతి ఒక్కరికీ వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరమని కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్‌ వీవీఎస్‌ మూర్తి అన్నారు.

వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం

కర్నూలు(అర్బన్‌), డిసెంబరు 21: ప్రతి ఒక్కరికీ వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరమని కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్‌ వీవీఎస్‌ మూర్తి అన్నారు. గురువారం కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగ దారుల వారోత్సవాల సందర్భంగా కళాశాల వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కులపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వినియోగదారుల హక్కులను తెలుసుకుని సమాజంలోని ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్‌ అధ్యక్షుడు కరణం కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ వినియోగదారుల కమిషన్‌లో ఎలా ఫిర్యాదు దాఖలు చేసి.. ఎలా న్యాయం పొందాలో ఉదాహ రణలతో వివరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. వినియోగదారుల ఫోరం కార్యదర్శి శివ మోహన్‌రెడ్డి, కమిషన్‌ సభ్యుడు ఎన్‌ నారాయణరెడ్డి, లీగల్‌ మెట్రాలజీ ఇన్స్‌పెక్టర్‌ హరితేజ, పరమేశ్వర్‌ కుమార్‌, మందుల కొనుగోలులో జరిగే మో సాలను వివరించారు. వాణిజ్య శాఖ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 12:03 AM