ఆటో బోల్తా.. ఒకరి మృతి
ABN , First Publish Date - 2023-11-20T00:39:05+05:30 IST
ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయా లయ్యాయి.

మరొకరికి గాయాలు
పెద్దకడబూరు నవంబరు 15: ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయా లయ్యాయి. మండల పరిధిలోని హనుమాపురం గ్రామ బస్ స్టాప్ దగ్గర ఆదోని- ఎమ్మిగనూరు జాతీ య రహదారిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు సమాచారం మేరకు.. ఆదోని మండలం మాంత్రికి గ్రామానికి చెందిన ఈడిగ బసవరాజు ఎమ్మిగ నూరు మండలం కోటేకల్‌లో నివాసం ఉంటున్నాడు. సొంత పని నిమి త్తం ఎమ్మిగనూరుకు వచ్చి కోటేకల్‌కు ఆటోలో బయలుదేరాడు. హను మాపురం గ్రామ బస్ స్టాప్ దగ్గర కుక్క అడ్డు రావటంతో డ్రైవర్‌ను తప్పించబోవడంతో ఆటో బోల్తా పడింది. దీంతో ఆటలో ప్రయాణిస్తున్న ఈడిగ బసవరాజు(43) అక్కడికక్కడే మృతి చెందాడు. బనవాసి గ్రామా నికి చెందిన దేవవరానికి గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. పెద్దకడుబూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.