ప్రేక్షకులు నాటక సమాజాలను ఆదరించాలి
ABN , First Publish Date - 2023-06-26T00:17:02+05:30 IST
ప్రేక్షకులు నాటక సమాజాలను ఆదరించాలని విశ్రాంత కలెక్టర్ బలరామయ్య అన్నారు.
విశ్రాంత కలెక్టర్ బలరామయ్య
కర్నూలు(కల్చరల్), జూన్ 25: ప్రేక్షకులు నాటక సమాజాలను ఆదరించాలని విశ్రాంత కలెక్టర్ బలరామయ్య అన్నారు. ఆదివారం రాత్రి టీజీవీ కళాక్షేత్రంలో, హైదరాబాదుకు చెందిన కళాంజలి నాటక సమాజం కళాకారులతో, కళాక్షేత్రం ఆధ్వర్యంలో ‘పాశం’, ‘మనిషి మంచోడే’ నాటిక లను ప్రదర్శించారు. ఈ నాటకాలను బలరామయ్య ప్రారంభించి మాట్లా డుతూ రాయలసీమ జిల్లాల్లోనే టీజీవీ కళాక్షేత్రం కళాప్రదర్శనలకు తలమా నికంగా నిలుస్తోందని చెప్పారు. పాశం, మనిషి మంచోడే నాటికలు మంచి సందేశంతో ప్రదర్శించారని కళాకారులను అభి నందించారు. ఈసందర్భంగా నాటిక ప్రదర్శనలిచ్చిన దర్శకుడు కొల్లా రాధాకృష్ణ ను, కళాకారులను బలరా మయ్య దంపతులు ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు, పారితోషికాలు అంద జేశారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ ఒకనాడు టికెట్టు పెట్టి పద్య నాటకాలు చూసే రోజులు ఉండేవని, కళాకారులకు స్వర్ణయుగంగా పేర్కొనే ఆ రోజులు మళ్లీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. టీజీవీ కళాక్షేత్రం ద్వారా ఇక ముందు ప్రతి నెలా చివరి ఆదివారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నాటక సమా జాలను ఆహ్వానించి సాంఘిక నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నా మన్నారు. కార్యక్రమంలో కళాక్షేత్రం ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మియా, సభ్యులు ఇనా యతుల్లా, లక్ష్మీకాంతరావు, రాముడు పాల్గొన్నారు.