మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2023-01-15T00:17:36+05:30 IST
మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వస్తున్న భక్తులకు పూర్తి స్దాయిలో ఏర్పాట్లు చేస్తామని ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి, చైర్మన్ కొమ్మా మహేశ్వరరెడ్డి తెలిపారు.
మహానంది, జనవరి 14: మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వస్తున్న భక్తులకు పూర్తి స్దాయిలో ఏర్పాట్లు చేస్తామని ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి, చైర్మన్ కొమ్మా మహేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ మహానంది సమీపంలోని దేవస్థానం స్థలంలో ఈ ఏడాది ప్రత్యేకంగా భక్తుల వాహనాలను నిలిపేందుకు పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్తి స్దాయిలో వసతులు కల్పిస్తామని చెప్పారు. నంద్యాల రూరల్ సీఐ రవీంద్ర, ఏఈఓ ఎర్రమల్ల మధు, సిబ్బంది పాల్గొన్నారు.