ఆరోగ్యశ్రీ కేసులను పెంచాలి
ABN , First Publish Date - 2023-10-04T00:46:33+05:30 IST
ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కేసులను పెంచాలని కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా.వి.వెంకట రంగారెడ్డి ఆదేశించారు.
సూపరింటెండెంట్ డాక్టర్ వి.వెంకట రంగారెడ్డి
కర్నూలు(హాస్పిటల్), అక్టోబరు 3: ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కేసులను పెంచాలని కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా.వి.వెంకట రంగారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆసుపత్రిలోని ధన్వంతరీ హాలులో వివిధ విభాగాల హెచ్‌వోడీలతో ఆరోగ్యక్ష కేసులపై ఆయన సమీక్ష నిర్వహిం చారు. ఆరోగ్యక్ష కేసుల విషయంలో జనరల్ మెడిసిన్ డెంటల్ ఓపీ, ఆర్థోపెడిక్ విభాగాల ముందంజలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డా.హరిచరణ్, ఆసుపత్రి డిప్యూటీ సీఎస్‌ఆర్ ఎంవో డా.హేమనళిని, హెచ్‌వోడీలు డా.ఇక్బా ల్ హుశేన్, డా.శ్రీని వాసులు, డా.లక్ష్మీ బాయి, ఆర్‌ఎంవో డా. వెంకటరమణ, నర్సు లు పాల్గొన్నారు.
‘