సివిల్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణకు దరఖాస్తులు
ABN , First Publish Date - 2023-07-21T00:07:48+05:30 IST
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు రెసిడెన్షియల్ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, సాధికారిత అధికారి ఎం.చింతామణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
నంద్యాల టౌన, జులై 20: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు రెసిడెన్షియల్ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, సాధికారిత అధికారి ఎం.చింతామణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత కోచింగ్ కోసం నిరుద్యోగులకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని, ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా రిజర్వేషన ప్రకారం ఎంపిక ఉంటుందన్నారు. ఎంపికైన అనంతరం సివిల్ సర్వీసెస్‌కు విశాఖపట్నంలో, గ్రూప్-1 సర్వీసెస్‌కు విజయవాడలో, గ్రూప్ -2 సర్వీసెస్‌కు తిరుపతిలో ఉచిత శిక్షణ ఉంటుందని అన్నారు. ఆగస్టు 5వ తేదీలోపు ఆనలైనలో దరఖాస్తు చేసుకోవాలని, అభ్యర్థి వార్షిక కుటుంబ ఆదాయం రూ.6 లక్షలకు మించకుండా ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.