అన్నప్రసాద వితరణ ప్రారంభం

ABN , First Publish Date - 2023-02-06T23:40:13+05:30 IST

శ్రీశైల దేవస్థానంలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పాదయాత్రగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కైలాస ద్వారం వద్ద దేవస్థానం అధికారులు అన్నప్రసాద వితరణ ప్రారంభించారు.

అన్నప్రసాద వితరణ ప్రారంభం

శ్రీశైలం, ఫిబ్రవరి 6: శ్రీశైల దేవస్థానంలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పాదయాత్రగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కైలాస ద్వారం వద్ద దేవస్థానం అధికారులు అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో పులిహోరా. సాంబారన్నం, పెరుగన్నం మొదలైన అన్నప్రసాదాలను అందజేయనున్నారు. అలాగే భక్తులకు భీనుని కొలను కైలాసద్వారం మెట్ల మార్గంలో తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-02-13T12:21:35+05:30 IST