Share News

రాష్ట్రంలో అరాచక పాలన: టీడీపీ

ABN , First Publish Date - 2023-11-22T00:10:10+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని టీడీపీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆరోపించారు.

రాష్ట్రంలో అరాచక పాలన: టీడీపీ
ప్యాపిలి: కొమ్మేమర్రిలో పాల్గొన్న ధర్మవరం సుబ్బారెడ్డి

ప్యాపిలి, నవంబరు 21: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని టీడీపీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆరోపించారు. మండలంలోని కొమ్మెమర్రి గ్రామంలో మంగళవారం బాబు ష్యూరిటీ..భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ పెట్రోలు, బస్సు, విద్యుత్‌ చార్జీలతో పాటు అన్ని రకాల నిత్యవసర వస్తుల ధరలను పెంచిన ప్రభుత్వ పేదల నడ్డి విరుస్తోందని విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారన్నారు. ప్రస్తుతం దివాల స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఆదరిస్తే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు. అనంతరం మేనిఫెస్టో పత్రాలను ప్రజలకు అందజేశారు. డోన్‌ మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణగౌడు, కాటమయ్య, ఆర్‌ఈ రాఘవేంద్ర, గండికోట రామసుబ్బయ్య, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

డోన్‌: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీడీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రజావైద్యశాల మల్లికార్జున అన్నారు. మంగళవారం పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో టీడీపీ నాయకులు ధర్మవరం పెద్దనాగిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. మల్లికార్జున మాట్లాడుతూ టీడీపీ హయాంలో విదేశీ విద్య ద్వారా ఎంతో పేద విద్యార్థులు చదువుకున్నారన్నారు. నాయకులు కొచ్చెర్వు రామాంజినేయులు, మదనగోపాల్‌ రెడ్డి, మస్తాన్‌, ప్రశాంత్‌ కుమార్‌, మాధవి, చరణ్‌, కిరణ్‌, మురళి, సతీష్‌నాయుడు, ఖాదర్‌ పాల్గొన్నారు.

బేతంచెర్ల: వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నగర పంచాయతీ పరిధిలోని బైటిపేటలో బూత్‌ 256లో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని కన్వీనర్‌ ఆంజాద్‌, షేక్షాలు పాల్గొన్నారు. షేక్షావలి చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది ప్రజా సంక్షేమం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం టీడీపీతోనే సాధ్యమని ఆయన అన్నారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పోలూరు వెంకటేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం నగర పంచాయితీ 1, 5 వార్డులలో పోలూరు సోదరుల ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రవేశ పెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో పేద, బడుగు బలహీనవర్గాల వారి జీవితాల్లో మార్పు రావడం ఖాయమన్నారు. ఉన్నం ఎల్ల నాగయ్య, ధర్మవరం పెద్ద నాగిరెడ్డి, గౌతమ్‌ రెడ్డి, తిరుమలేష్‌ చౌదరి, జాకీరుల్లా భేగ్‌, రామనాథం, బట్ట సత్యం, జలదుర్గం విష్ణు, కనపకుంట మధుసూదన్‌ రెడ్డి, కొచ్చెర్వు రామాంజినేయులు, రమేష్‌ రెడ్డి, అరుణ్‌ కుమార్‌, జక్రియ, కుమ్మరి శ్రీనివాసులు, దస్తగిరి పాల్గొన్నారు.

శిరివెళ్ల: రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని గోవిందపల్లె గ్రామ టీడీపీ నాయకులు గంగదాసరి శ్రీనివాసరెడ్డి, రవిచంద్రారెడ్డి, లక్ష్మిరెడ్డి, సంగిరెడ్డి నాగేశ్వరరెడ్డి అన్నారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గోవిందపల్లెలో పర్యటించారు. టీడీపీ మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లారు. రాష్ట్రాభివృద్ధి కోసం రైతులు, యువత, ఉద్యోగులు వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని కోరారు.

చాగలమర్రి: రాష్ట్రంలో చంద్రబాబుతోనే భవిషత్తుకు గ్యారెంటీ ఉంటుందని టీడీపీ నాయకులు, సర్పంచ్‌ లక్ష్మీ ఓబులమ్మ, సుబ్రమణ్యం, ఓబన్న అన్నారు. మంగళవారం మద్దూరు గ్రామంలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. నాయకులు సుబ్బయ్య, సుబ్బరాయుడు, అంజి, ఇమామ్‌వలి, మహిళలు పాల్గొన్నారు.

వచ్చే వైసీపీకి పతనం తప్పదని టీడీపీ నాయకులు శేఖర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి అన్నారు. గొడిగనూరులో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. టీడీపీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు.

రుద్రవరం: రాష్ట్రాభివృద్ధి టీడీపీ అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. మంగళవారం సాయంత్రం నాగులవరం గ్రామంలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు తప్ప ప్రజలకు చేసిందేమీలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు, ప్రజల సమస్యలు ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు పట్టించుకోవడంల లేదన్నారు. నాయకులు బాచిపల్లె వెంకటనారాయణ, ఎల్‌వీ రంగనాయకులు, పోలా గురుమూర్తి, రెక్కల మనోహర్‌రెడ్డి, రెక్కల వెంకటసుబ్బారెడ్డి, బీసీ సెల్‌ తాలుకా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, ఎస్సీ సెల్‌ నంద్యాల పార్లమెంటు కార్యదర్శి కొమ్మలపాటి రాజారావు, చంద్రశేఖర్‌, బాల వెంకటసుబ్బయ్య, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

కొలిమిగుండ్ల: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ అన్నారు. కొలిమిగుండ్ల మండలం కోరుమానుపల్లి గ్రామంలో ‘బాబు ష్యూరీటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ ఇందిరమ్మ ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. అనంతరం రచ్చబండ దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి బీసీ ఇందిరమ్మ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కక్ష గట్టి లేని ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. టీడీపీ మండల కన్వీనర్‌ మూలే రామేశ్వర్‌ రెడ్డి, ప్రచార కార్యదర్శి శివరామిరెడ్డి, కోరుమానుపల్లి గ్రామ నాయకులు నరసింహ రెడ్డి, మాజీ సర్పంచ్‌ జయలక్ష్మి రెడ్డి, మదనాంతపురం కొండారెడ్డి పాల్గొన్నారు.

సంజామల: మండలంలోని రెడ్డిపల్లె గ్రామంలో బుధవారం బుబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి పాల్గొంటున్నట్లు బీసీ వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్‌ రెడ్డి మంగళవారం తెలిపారు. మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-22T00:10:11+05:30 IST