అపురూపం.. ఆనందం..!
ABN , First Publish Date - 2023-02-21T23:50:09+05:30 IST
అపురూపం.. ఆనందం..!
- నేడు ప్రపంచ కవలల దినోత్సవం
ఆత్మకూరు, ఫిబ్రవరి 21: వాస్తవానికి ఒకే తల్లి గర్భం నుంచి ఒకేసారి ఒక్కరికన్నా.. ఎక్కువ మందిని జన్మస్తే.. వారిని కవలలుగా పేర్కొంటారు. ప్రపంచంలో మొదటి సారి కవలలు దినోత్సవాన్ని పోలెండ్‌లో 1976లో నిర్వహించారు. పోలెండ్‌లో జన్మించిన మోజస్, ఆరన్‌విల్‌కాక్స అనే కవల సోదరులు మరణించిన రోజును ప్రపంచ కవలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సోదరులు తాము నివసిస్తున్న ఇంటిని ట్విన్స్ బర్గ్ అని పేరు పెట్టుకుని ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. వివాహం తర్వాత కూడా తమ అనుబంధం వీడకూడదన్న ఉద్దేశంతో అక్కాచెల్లెలను వివాహం చేసుకుని రెండు కుటుంబాలు ఎంతో అనురాగంతో ఉండేవి. అయితే ఇద్దరూ ఒకే వ్యాధితో బాధపడుతూ.. ఒకే రోజు(ఫిబ్రవరి 22)న మరణించారు. బింబి ప్రతిబింబాల మాదిరిగా వీరి ఆత్మీయ కలయిను గౌరవిస్తూ.. పోలెండ్ ప్రభుత్వం ఈ రోజున ప్రపంచ కవల దినోత్సవంగా ప్రకటించింది. దీనికి పలు ప్రపంచదేశాలు కూడా అంగీకారం తెలిపాయి.
కవలల గురించి కొన్ని నిజాలు :
ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల కవలలు ఉన్నట్లు 2006లో ఓ అంతర్జాతీయ సర్వే సంస్థ పేర్కొంది. ఇందులో 0.2శాతం మంచి గుర్తించడానికి వీలు లేకుండా ఒకే పోలికతో ఉన్నారు. అలాగే పుట్టే ప్రతి 1000 మంది కవలల్లో కేవలం 32 మంది మాత్రమే జీవిస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా కవలలు ఎక్కువగా ఉన్న దేశం యోరుబా. ఈ దేశంలో పుట్టే ప్రతి 1000 మందిలో 42 మంది కవలలే. భారతదేశంలో అలహాబాద్ సమీపంలోని మహమ్మద్‌ఉమ్రి గ్రామం కవలల గ్రామంగా పేరుగాంచింది. కారణం ఈ గ్రామంలో 600 మంది జనాభా ఉండగా 33 జతల కవలలు ఉండటం గమనార్హం. కాగా మనదేశంలో తొలిసారిగా కవలల పండుగా 2004లో హైద్రాబాద్‌లో నిర్వహించారు. ఈ పండుగలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవలలు తన సంతోషాలను పంచుకున్నారు.
చిన్నప్పటి నుంచి అభిరుచులు, అలవాట్లు ఒక్కటే : ఫయాజ్, రియాజ్ - ట్విన్స్, ఆత్మకూరు:
ఆత్మకూరు పట్టణానికి చెందిన లారీ డ్రైవర్ ఎన్‌ఎస్.నబీ, ఖుర్షీద్‌బీ దంపతులకు 30ఏళ్ల కిందట ఫయాజ్, రియాజ్ అనే కవలలు జన్మించారు. చిన్నప్పటి నుంచి వారి అభిరుచులు, అలవాట్లు ఒక్కటే. చదువు, ఆటలు, తిండి, డ్రస్సులు తదితర అభిరుచులు ఒకేలా ఉన్నాయి.
ఒకరిని మించి మరొకరి ఉత్సాహం : దేష్నాశ్రీ, దేవజ్‌నంద - ట్విన్స్, ఆత్మకూరు:
ఆత్మకూరు పట్టణంలోని కొండా వెంకటస్వామి, త్రివేణి దంపతులకు మొదటి సంతానంగా దేష్నాశ్రీ, దేవజ్‌నంద అనే కవలలు జన్మించారు. వీరిలో లింగబేధం ఉన్నప్పటికీ ఇరువురు భలే చురుగ్గా వుంటారు. పైగా వీరు చాలా దగ్గరి పోలికలు కలిగి ఉండి ఒకే డ్రస్‌లో ఉంటే ఎవరెవరో గుర్తించడం కష్టంగా ఉంటుంది. సీజనల్ సమయంలో ఇద్దరూ ఒకే విధంగా వ్యవహరిస్తారు.