వీఆర్‌కు ఆలూరు సీఐ

ABN , First Publish Date - 2023-04-21T23:37:53+05:30 IST

ఆలూరు సీఐ ఈశ్వరయ్యను వీఆర్‌కు పంపుతూ పోలీస్‌ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయి.

వీఆర్‌కు ఆలూరు సీఐ

ఆలూరు, ఏప్రిల్‌ 21: ఆలూరు సీఐ ఈశ్వరయ్యను వీఆర్‌కు పంపుతూ పోలీస్‌ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఆలూరు సీఐ ఈశ్వరయ్య పలు వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల హాలహర్వి మండలంలో ఇసుక అక్రమ రవాణా నిర్వాహకులతో సీఐ మాట్లాడిన సంభాషణకు సంబంధించిన వాయిస్‌ రికార్డింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కృష్ణకాంత్‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆలూరు సీఐని వీఆర్‌కు పంపినట్లు సమాచారం. సీఐ వీఆర్‌పై పోలీస్‌ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఐ వీఆర్‌కు వెళ్లకుండా స్థానిక అధికార పార్టీ నేతలు ప్రయత్నించినా, మంత్రి జయరాం సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. ఈ విషయంపై ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా, సీఐను వీఆర్‌కు పంపిన మాట వాస్తవమే చెప్పారు.

Updated Date - 2023-04-21T23:37:53+05:30 IST