బాబుకు తోడుగా మేము సైతం
ABN , First Publish Date - 2023-09-20T00:17:41+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా బాబుకు తోడుగా మేము సైతం అంటూ మహిళలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

రిలే నిరాహార దీక్షలో మహిళలు
ఆదోని,సెప్టెంబరు 9: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా బాబుకు తోడుగా మేము సైతం అంటూ మహిళలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మంగళవారం స్థానిక ఎన్టీఆర్ విగ్రహం ఎదుట మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు అధ్యక్షతన ఉమాపతినాయుడు ఆఽధ్వర్యంలో మహిళలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు నల్ల జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, నియోజకవర్గ అబ్జర్వర్ గాజుల ఆదెన్న మాట్లాడారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా టీడీపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. దీక్షల్లో దొడ్డనగేరి సర్పంచ్ పార్వతమ్మ, విజయలక్ష్మి, రమీజాబీ మగ్దుమ్, అంజూగాంధీ, రాజేశ్వరి, నూర్జహాన్, ఉమామహేశ్వరి, స్వప్న, శ్రీదేవి, సాదికా బేగం, అయ్యమ్మలతో పాటు ధనలక్ష్మి, నీరజా, శాంతి, ఈరమ్మ, జోతమ్మలు ఉన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, టీడీపీ నాయకులు బసాపురం రామస్వామి, రంగన్న, సలకలకొండ ప్రతాప్ రెడ్డి, బుద్దారెడ్డి, తిమ్మప్ప, జయరాం, కల్లుబావి మల్లికార్జున, జగదీష్, కృష్ణారెడ్డి, మదిరె వీరేష్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శైలజ పాల్గొన్నారు.