అదానీ అక్రమ వ్యాపారాలపై విచారణ జరపాలి

ABN , First Publish Date - 2023-02-07T00:29:31+05:30 IST

అదానీ అక్రమ వ్యాపారాలపై సీబీఐచే విచారణ జరిపించాలని నంద్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు జే.లక్ష్మీనరసింహ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

అదానీ అక్రమ వ్యాపారాలపై విచారణ జరపాలి

నంద్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్‌

కల్లూరు, ఫిబ్రవరి 6: అదానీ అక్రమ వ్యాపారాలపై సీబీఐచే విచారణ జరిపించాలని నంద్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు జే.లక్ష్మీనరసింహ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం నగరంలోని నంద్యాల చెక్‌పోస్టులోని కాంగ్రెస్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎనిమిది ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ఎల్‌ఐసీ, ఎస్బీఐలకు నష్టం చేకూరేలా ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టిన అదానీ సంస్థలపై సూప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. హిడెన్‌బర్గ్‌ నివేదిక అన్ని విషయాలను బహిర్గతం చేసిందని, కేంద్రం ప్రభుత్వం అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఎల్‌ఐసీలో 18 వేల కోట్లు, ఎస్‌బీఐకి 45 వేల కోట్లు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఈసమావేశంలో బాలస్వామి, పఠాన్‌, వెంకట్‌ నాయుడు, ఖాదర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:29:35+05:30 IST