తప్పుడు మార్గాల్లో వాహనాలు నడిపితే చర్యలు: ఆర్టీవో
ABN , First Publish Date - 2023-05-26T23:37:23+05:30 IST
తప్పుడు మార్గాల్లో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డోన్ ఆర్టీవో క్రాంతి కుమార్ హెచ్చరించారు.

డోన్(రూరల్), మే 26: తప్పుడు మార్గాల్లో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డోన్ ఆర్టీవో క్రాంతి కుమార్ హెచ్చరించారు. శుక్రవారం అమకతాడు టోల్ ప్లాజా 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆర్టీవో వాహనాలను తనిఖీ చేశారు. మహారాష్ట్రకు చెందిన మినీ వాహనం వేరే నెంబరు ప్లేటుతో తిరుగుతుండడాన్ని గమనించిన ఆర్టీవో రూ.50 వేల జరిమానా విధించారు. సరైన పత్రాలు లేకుండా వేరే వాహనాల నెంబరు ప్లేట్లతో వాహనాలు నడిపితే జరిమానాలు విధించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.