గార్గేయపురంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
ABN , First Publish Date - 2023-08-02T00:18:43+05:30 IST
కర్నూలు రూరల్ మండలం గార్గేయపురం గ్రామంలో టీడీపీ ఆధినేత చంద్రబాబు నాయుడుకి కోడు మూరు మాజీ ఇన్‌చార్జి, టీడీపీ సీనియర్ నేత ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు.
టీడీపీ నేత విష్ణు నేతృత్వంలో భారీ ర్యాలీ
కర్నూలు(రూరల్) ఆగస్టు 1: కర్నూలు రూరల్ మండలం గార్గేయపురం గ్రామంలో టీడీపీ ఆధినేత చంద్రబాబు నాయుడుకి కోడు మూరు మాజీ ఇన్‌చార్జి, టీడీపీ సీనియర్ నేత ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. సాగు, తాగునీటి ప్రాజెక్ట్టుల సందర్శనార్థం మంగళ వారం ఉమ్మడి కర్నూలు జిల్లాకు చేరుకున్న చంద్రబాబు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా కర్నూలు రూరల్ మండలం బి. తాండ్రపాడు, నంద్యాల చెక్ పోస్టు, వెంకాయపల్లె, మిలటరీ కాలనీ, గార్గేయపురం మీదుగా నంది కొట్కూరుకు వెళ్లారు. విష్ణువర్థన్‌రెడ్డి నంద్యాల చెక్‌పోస్టు నుంచి తన వర్గీయులతో గార్గేయపురం గ్రామానికి కార్లు, బైక్‌లతో భారీ ర్యాలీ చేప ట్టారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చంద్రబాబు గార్గేయపురం చేరుకుని గ్రామ సెంటర్‌లో కాసేపు కాన్వాయ్‌ను ఆపి విష్ణును చంద్రబాబు తన వాహనంపైకి పిలుచుకుని వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం చంద్రబాబును గజమాలతో విష్ణు సన్మానించారు. అక్కడి నుంచి నందికొట్కూరుకు బాబు కాన్వాయ్ బయలుదేరి వెళ్లారు. విష్ణు వెంట టీడీపీ సీనియర్ నాయకులు, కెడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కేఈ వేమనగౌడ్, కోడుమూరు నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు బొగ్గుల దస్తగిరి, సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆకెపోగు జయ న్న, మాజీ సర్పంచు కౌలుట్లయ్య, బొగ్గుల రాజు, సాయికృష్ణ, సర్పంచులు తొలిశాపురం గిడ్డయ్య, కొంతలపాడు మహానంది, నాగలా పురం సురేష్, రేమట వెంకన్న, దిన్నేదేవరపాడు మాధవస్వామి, ఎంపీటీసీ సభ్యులు కురువ మద్దిలేటి, కురువ నాగరాజు, ఉల్చాల శివన్న, లద్దగిరి పట్టెకృష్ణ కర్నూలు రూరల్, బెళగల్, గూడూరు, కోడుమూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు, విష్ణువర్గీయులు హాజరయ్యారు.
ఓర్వకల్లు విమానశ్రయానికి తరలిన టీడీపీ శ్రేణులు
ఓర్వకల్లు: నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబును చూసేం దుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఓర్వకల్లు విమానాశ్రయానికి పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి టీడీపీ నాయకులు, అభిమానులు తరలి వచ్చి చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు మహబూబ్‌బాషా, నాయకులు మోహన్ రెడ్డి, గోవిం దరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, సుధాకర్‌రావు, లక్ష్మీకాంతరెడ్డి, సుధాకర్, రామగోవిందు, వడ్డే నారాయణ, గువ్వ రవికుమార్, కాటినేని నారాయణ, అబీ తదితరులు తమ అనుచరులతో తరలివచ్చారు.