వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-09-23T00:23:29+05:30 IST
కోసిగిలోని రైల్వేగేటు సమీపంలో కడాపాలెం ఏరియాకు చెందిన మంగళి గోపాల్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
కోసిగి, సెప్టెంబరు 22: కోసిగిలోని రైల్వేగేటు సమీపంలో కడాపాలెం ఏరియాకు చెందిన మంగళి గోపాల్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే జీఆర్‌పీ ఎస్‌ఐ రామస్వామి తెలిపిన వివరాలివీ.. కోసిగిలోని కడాపాలెం ఏరియాకు చెందిన మంగళి గోపాల్ (52) మృతి చెందినట్లు సమాచారం అందడంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మితం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. గోపాల్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గోపాల్ బార్బర్ షాపును నిర్వహిస్తూ జీవనం కొనసాగించేవారు. ఆర్థికంగా ఇబ్బందుల కారణంగా మనస్తాపంతో ఆత్మహత్య చేసకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.