బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2023-07-20T00:17:22+05:30 IST

మండల పరిధిలోని నదిచాగి-మేళిగనూరు గ్రామాల మధ్య బుధవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.

బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి

కౌతాళం, జూలై 19: మండల పరిధిలోని నదిచాగి-మేళిగనూరు గ్రామాల మధ్య బుధవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. నదిచాగి గ్రామానికి చెందిన నాగన్నగౌడ్‌(55) పని నిమిత్తం మేళిగనూరుకు వెళ్లాడు. తిరిగి నదిచాగికి వస్తుండగా కర్ణాటకవాసులు చెళ్లెకూడ్లూరుకు ద్విచక్ర వాహనంపై వస్తూ ఎదురెదురుగా ఢీకొన్నారు. దీంతో నాగన్నగౌడ్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. కర్ణాటక వాసులకు గాయాలయ్యాయి. కౌతాళం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-07-20T00:17:22+05:30 IST