సెలవు రోజూ పన్ను చెల్లింపునకు అవకాశం

ABN , First Publish Date - 2023-03-19T23:58:59+05:30 IST

ప్రజలకు సెలవు రోజులలో కూడా ఆస్తిపన్ను, నీటిపన్ను, ఖాళీ జాగాల పన్నుల చెల్లింపుకు మున్సిపాల్‌ కార్యాలయంలో అవకాశం కల్పిస్తున్నట్లు మునిసిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి ఆదివారం తెలిపారు.

  సెలవు రోజూ పన్ను చెల్లింపునకు అవకాశం

ఆదోని టౌన, మార్చి 19: ప్రజలకు సెలవు రోజులలో కూడా ఆస్తిపన్ను, నీటిపన్ను, ఖాళీ జాగాల పన్నుల చెల్లింపుకు మున్సిపాల్‌ కార్యాలయంలో అవకాశం కల్పిస్తున్నట్లు మునిసిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ నెల 31వ తేదీలోగా పన్ను బకాయిలను ఏకకాలంలో చెల్లించిన వారికి వడ్డీ మాఫీ అవకాశం ప్రభుత్వం కల్పించడంతో సెలవు దినాలలో కూడా చెల్లింపు కౌంటర్‌ పని చేసేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పట్టణాభివృద్ది కోసం 31వ తేదీలోగా ప్రజలు పన్నులు చెల్లించి ప్రజలు సహకరించవలసిందినగా ఆయన కోరారు.

Updated Date - 2023-03-19T23:58:59+05:30 IST