పోలీసు స్పందనకు 96 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2023-08-22T00:47:33+05:30 IST

స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవా రం ఎస్పీ జి.కృష్ణకాంత్‌ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు.

పోలీసు స్పందనకు 96 ఫిర్యాదులు
ఎస్పీకి సమస్యలు విన్నవిస్తున్న బాధితులు

కర్నూలు, ఆగస్టు 21: స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవా రం ఎస్పీ జి.కృష్ణకాంత్‌ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాధితుల నుంచి 96 ఫిర్యాదులు వచ్చాయి. జోహరాపురం ఇందిరమ్మ గృహాలలో నా భూమి పట్టా స్థలాన్ని నాకు తెలియకుండా పట్టా మార్పిడి చేసే వేరే వ్యక్తులు ఆక్రమించుకున్నారని కర్నూలు సాయిబాబా నగర్‌కు చెందిన అంజినమ్మ ఫిర్యాదు చేశారు. కర్నూలు మాధవనగర్‌కు చెందిన ఒక ప్రైవేటే స్కూల్‌లో ఇద్దరు పిల్లలకు అడ్మిషన్‌ ఫీజు కట్టిన వెంటనే డ్రాపైన కూడా 6 నెలల నుంచి కాలాయాపన చేస్తూ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని కర్నూలు శ్రీరాం నగర్‌కు చెందిన రేష్మా ఫిర్యాదు చేశారు. ఇద్దరు వ్యక్తులు నా పొలాన్ని దారి లేకుండా చేసి నన్ను ఇబ్బం దులకు గురి చేస్తున్నారని నందవరం మండలం నాగలదిన్నె గ్రామాని చెం దిన చిన్న మునెప్ప మొరపెట్టుకున్నారు. కర్నూలు బళ్లారి చౌరస్తాలోని ఎంజీ బ్రదర్స్‌, జేసీబీ షోరూమ్‌లో కూలి పనికి వెళ్లడంతో సెల్స్‌మెన్‌గా పని చేస్తున్న వెంకటేశ్వర్లు, బలరా ముడు నన్ను నమ్మించాడు. రూ.లక్ష ఇచ్చి ఆశ చూపించారు. నా ఆధార్‌, పాన్‌ కార్డులు తీసుకుని తన పేరు మీద ఎక్స్‌కవేటర్‌కు లోనూ తీసుకు న్నారు. 3 కంతులు కట్టారు. తర్వాత ఎక్స్‌కవేటర్‌ లేకుండా చేశారు. ఫైనాన్స్‌ కంతులు కట్టకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు అన్ని కంతులు కట్టమని మోసం చేస్తున్నారని కర్నూలు మండలం దేవమాడ గ్రామానికి చెందిన నాగన్న ఫిర్యాదు చేశారు. హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కౌతాళం గ్రామానికి చెందిన మహిళ రూ.1.50 లక్షలు తీసుకుని మోసం చేశారని నందవరం మండలం పోనకల్లుదిన్నె గ్రామానికి చెందిన ప్రదీప్‌ విన్నవించారు. సాధిక్‌, సయ్యద్‌ అనే ఇద్దరు వ్యక్తులు తనకు కర్నూలులో 108 వాహనం డ్రైవర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ1.60 లక్షలు తీసుకుని మోసం చేశారని కల్లూరు మండలం ఏ.గోకులపాడు గ్రామానికి చెందిన సోమశేఖర్‌ ఫిర్యాదు చేశారు. స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ జి.కృష్ణకాంత్‌ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:47:33+05:30 IST