ఇన్‌స్పైర్‌ పోటీల్లో రాష్ట్ర స్థాయికి 24 మంది

ABN , First Publish Date - 2023-03-18T23:55:08+05:30 IST

2021-22 విద్యాసంవత్సరానికి గాను ఈ నెల 14, 15 తేదీలలో జరిగిన ఇన్‌స్పైర్‌ మనక్‌ జిల్లా స్థాయి ఆన్‌లైన్‌ పోటీల్లో రాష్ట్ర స్థాయికి 24 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి తెలిపారు.

ఇన్‌స్పైర్‌ పోటీల్లో రాష్ట్ర స్థాయికి 24 మంది

కర్నూలు(ఎడ్యుకేషన్‌), మార్చి 18: 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఈ నెల 14, 15 తేదీలలో జరిగిన ఇన్‌స్పైర్‌ మనక్‌ జిల్లా స్థాయి ఆన్‌లైన్‌ పోటీల్లో రాష్ట్ర స్థాయికి 24 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి తెలిపారు. శనివారం స్థానిక డీఈవో చాంబర్‌లో రాష్ట్ర స్థాయి ఎంపికకు సంబంధించిన జాబితాను డీఈవో రంగారెడ్డి, ఉప విద్యాశాఖ అధికారి హనుమంతరావు ప్రకటించారు. ఈ ఫలితాలను ఆన్‌లైన్‌లో ఎన్‌ఐఎఫ్‌ పంపగా డీఈవో రంగారెడ్డి వాటిని ప్రకటించారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన 24 మంది ఈ నెల 23, 24 తేదీలలో కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయిలో జరిగే ఆన్‌లైన్‌ పరీక్షలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ కో ఆర్డినేటర్‌ రంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:55:08+05:30 IST