పోలీసు స్పందనకు 103 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2023-02-21T00:29:42+05:30 IST

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు.

   పోలీసు స్పందనకు 103 ఫిర్యాదులు

కర్నూలు, ఫిబ్రవరి 20: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 103 ఫిర్యాదులు వచ్చాయి.

ఫ పశు సంవర్ధ్దక శాఖలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కర్నూలు చెందిన ఒక వ్యక్తి డబ్బులు తీసుకుని మోసం చేశారని నందికొట్కూరు చెందిన మౌలాలి ఫిర్యాదు చేశారు.

ఫ హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కర్నూలుకు చెందిన ఒక వ్యక్తి డబ్బులు తీసుకుని మోసం చేశారని హేమంత కుమార్‌ ఫిర్యాదు చేశారు.

ఫ కులం పేరుతో దూషిస్తూ ఒక వ్యక్తి బెదిరించాడని కర్నూలు కృష్ణానగర్‌కు చెందిన శ్రీనాథ్‌ ఫిర్యాదు చేశారు.

ఫ రైల్వే డిపార్టుమెంట్‌లో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక వ్యక్తి మోసం చేశాడని కర్నూలు, కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రాజారత్నం, పక్కిరయ్య ఫిర్యాదు చేశారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను త్వరలో పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ స్సందన కార్యక్రమంలో సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ కృష్ణకాంత పటేల్‌, అడిషనల్‌ ఎస్పీ అడ్మిన డి.ప్రసాద్‌, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జునరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T00:29:43+05:30 IST