ఇక ఎన్టీఆర్‌ జిల్లా ప్రజలకు అందుబాటులో జడ్పీ సీఈఓ

ABN , First Publish Date - 2023-06-03T01:24:55+05:30 IST

ఉమ్మడి జడ్పీ సీఈఓ జ్యోతిబసు ఇక వారంలో రెండు రోజులు విజయవాడలోని జడ్పీ క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.

ఇక  ఎన్టీఆర్‌ జిల్లా ప్రజలకు అందుబాటులో జడ్పీ సీఈఓ

ప్రతి బుధ, శుక్రవారాల్లో విజయవాడ జడ్పీ కార్యాలయానికి రాక

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఉమ్మడి జడ్పీ సీఈఓ జ్యోతిబసు ఇక వారంలో రెండు రోజులు విజయవాడలోని జడ్పీ క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ రాజ్యాంగ బద్ధమైన అంశాల కారణంగా జడ్పీ విడివడని సంగతి తెలిసిందే. 2026 వరకు ఉమ్మడి జడ్పీగా కొనసాగుతుంది. ఆ తర్వాత రెండు జిల్లాల జడ్పీలు వేర్వేరుగా ఉంటాయి. ఉమ్మడి జిల్లా జడ్పీగా కొనసాగుతున్నప్పటికీ కృష్ణా జిల్లాకు ఇస్తున్న ప్రాధాన్యం, ఎన్టీఆర్‌ జిల్లాకు ఇవ్వటం లేదన్న అభిప్రాయం ఉంది. ఎన్టీఆర్‌జిల్లా నుంచి ఆదాయాన్ని పిండుకునే అంశాలపై చూపిస్తున్న శ్రద్ధ, అభివృద్ధి పనులపై చూపటం లేదన్న విమర్శలూ ఉన్నాయి. జడ్పీ చైర్‌ పర్సన్‌ కృష్ణాజిల్లా మహిళ కావటంతో పాలనలో పక్షపాతం చూపుతు న్నారన్న విమర్శలూ ఉన్నాయి. జడ్పీకి అత్యంత ప్రధానమైన సీఈఓను ప్రజలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కలవాలంటే బందరు వెళ్లాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జడ్పీ సీఈఓ విజయవాడ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ప్రతి బుధవారం, శుక్రవారం రోజుల్లో విజయవాడ లోని స్వరాజ్య మైదాన్‌కు ఎదు రుగా బందరు రోడ్డు వెంబడి ఉన్న జడ్పీ క్యాంపు కార్యాలయంలో ఆయన అందుబాటులో ఉంటారు. శుక్రవారం జడ్పీ సీఈఓ విజయవాడ వచ్చారు. ఇక్కడి నుంచి జగ్గయ్యపేట పర్యటనకు వెళ్లారు. ఎన్టీఆర్‌ జిల్లా ప్రజల కోసం, జడ్పీటీసీలు, ఎంపీటీసీల అవస రాలను దృష్టిలో ఉంచుకుని వారికి దగ్గరగా ఉండ టానికి విజయవాడలో వారంలో రెండు రోజుల పాటు అందుబాటులో ఉంటానని తనను కలిసిన ఆంధ్రజ్యోతికి ఆయన చెప్పారు. జడ్పీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విజయవాడకు వస్తున్నానని తెలిపారు. అధికారికంగా అందుబాటులో ఉంటున్నట్టు ప్రకటించకపోయినా.. వారంలో రెండు రోజులు వస్తున్నానని చెప్పారు. ఇక మీదట తనను కలవాలనుకున్నవారు ప్రతి బుధ, శుక్రవారాల్లో నేరుగా విజయవాడలోని కార్యాలయానికి రావచ్చునని చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లాలో జడ్పీ సమావేశాలను నిర్వహించే అంశంపై ఆయన స్పందిస్తూ ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన అంశాల దృష్ట్యా అలా చేయలేమని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటామని తె లిపారు.

Updated Date - 2023-06-03T01:24:55+05:30 IST