వైసీపీ ప్రభుత్వంపై విసుగెత్తిపోయారు

ABN , First Publish Date - 2023-05-27T01:30:30+05:30 IST

వైసీపీ ప్రభు త్వంపై అ పార్టీ నాయకులే విసుగెత్తి పోయారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. కంకిపాడు మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన పలు వురు వైసీపీ నాయకులు శుక్రవారం బోడె ప్రసాద్‌ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పని తీరుపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నార న్నారు.

 వైసీపీ ప్రభుత్వంపై విసుగెత్తిపోయారు
వైసీపీ నాయకులకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌

మద్దూరు (కంకిపాడు), మే 26 : వైసీపీ ప్రభు త్వంపై అ పార్టీ నాయకులే విసుగెత్తి పోయారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. కంకిపాడు మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన పలు వురు వైసీపీ నాయకులు శుక్రవారం బోడె ప్రసాద్‌ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పని తీరుపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నార న్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు వైసీపీని అధికా రంలోకి తీసుకువచ్చిన వైసీపీ నాయకులు, కార్య కర్తలు కూడా ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నార న్నారు. రానున్న ఎన్నికల సమయానికి వైసీపీ ఖాళీ అవుతుందని జోష్యం చెప్పారు. ఈ కార్యక్ర మంలో మాజీ జేడ్పీటీసీ గొంది శివరామకృష్ణ ప్రసాద్‌, యనమదల మదన్‌, మాజీ సర్పంచ్‌ వల్లే నరసింహారావు, సుదిమళ్ల రవీంద్ర, రంగారావు, మన్నే వాసు, రావి శ్రీనివాసరావు, సజ్జా శ్రీనివాసరావు, సురేష్‌, రాజేష్‌, నవీన్‌, సుబ్బారావు, సలీం, ఈడా రఘు, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు తమ్ముళ్లకు దిశానిర్దేశం

పెనమలూరు : రాజమండ్రిలో టీడీపీ నేటి నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసుపు పం డుగ మహానాడుకు తరలి వెళ్లే పెనమలూరు పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ శుక్రవారం దిశానిర్దేశం చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల ప్రత్యేక సందర్భాన రాజమండ్రి వేమగిరి వద్ద జరుగుతున్న ఈ మహానాడుకు పార్టీ అధిష్టానం అత్యంత ప్రాముఖ్యతనిస్తున్న విషయాన్ని పార్టీ శ్రేణులకు తెలియజెప్పి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కంకిపాడు మండలం నుంచి కనీసం వంద మంది కార్యకర్తలు, నాయకులు కార్లు బస్సుల్లో మహానాడు ప్రాంగణానికి తరలి వెళ్లనున్నట్లు టీడీపీ కంకిపాడు మండలాధ్యక్షుడు సూదిమళ్ల రవీంద్ర తెలిపారు. కార్లకు అవసరమైన పాస్‌లను నాయకులకు అందజేశారు. మహానాడులో జరిగే కార్యక్రమ వివరాలను క్లుప్తంగా నా యకులకు వివరించారు. పార్టీ పరిశీలకులు జువ్వా రామకృష్ణ, నాయకులు శుభశేఖర్‌, అన్నే ధనయ్య తదితరులు పాల్గొన్నారు.

గన్నవరం : రాజమహేంద్రవరంలో జరిగే మహానాడుకు నియోజకవర్గం నుంచి టీడీపీ నాయ కులు కార్యకర్తలు, శ్రేయాభిలాషులు తరలిరావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకులు వడ్రాణం హరిబాబు నాయుడు, మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రకటనలో కోరారు. ఉత్సాహంగా జరిగే టీడీపీ పండుగను విజయవంతం చేయాలని, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అందరూ వ్యతిరేకించాలని, బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశమమని పేర్కొన్నారు. టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్‌ ఆధారపడి ఉందని, నాలుగేళ్ల పాలనలో రాష్ర్టాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అన్ని రంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2023-05-27T01:30:30+05:30 IST