ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ విఫలం

ABN , First Publish Date - 2023-09-26T00:41:49+05:30 IST

పశ్చిమలో ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి డివి. కృష్ణ తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ విఫలం
ప్రజాభేరి యాత్రలో నాయకులు కృష్ణ, సత్యబాబు, ఆదిలక్ష్మి తదితరులు

ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ విఫలం

సీపీఎం జిల్లా కార్యదర్శి డివి. కృష్ణ

చిట్టినగర్‌, సెప్టెంబరు 25 : పశ్చిమలో ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి డివి. కృష్ణ తెలిపారు. సీపీఎం పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం చేపట్టిన ప్రజాభేరి సోమవారం 50వ డివిజన్‌ ఖాదర్‌ సెంటర్‌లో జరిగింది. ఈ సందర్భంలో డివిజన్‌లోని పలు వీధుల్లో ప్రజాగర్జన యాత్ర నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంలో కృష్ణ మాట్లాడుతూ పేదలకు ఉచితంగా ఇళ్లు ఇవ్వాలని, ఇళ్ల పట్టాలు రిజిస్ర్టేషన్‌ చేయాలన్నారు. నీటితో వ్యాపారం, ఇంటి ఇంటికీ నీటి మీటర్లు ఏర్పాటు చేయడం వెంటనే ఆపాలని, లేని పక్షంలో స్థానికులతో పోరాటం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ప్రారంభమైన పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం ఈ నెల 29 వరకు కొనసాగుతాయని, 30న తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక కార్పొరేటర్‌ బోయి సత్యబాబు, మాజీ కార్పొరేటర్‌ గాదె ఆదిలక్ష్మి, నాయకులు ఇవి. నారాయణ, కె. సూరిబాబు, ఎస్‌. సుబ్బారెడ్డి, చౌదరి, రాజు, స్వప్న పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:41:49+05:30 IST