వైసీపీ ట్వీట్‌లో తప్పేముంది?

ABN , First Publish Date - 2023-02-21T01:17:01+05:30 IST

మహా శివరాత్రిని పురస్కరించుకుని వైసీపీ చేసిన ట్వీట్‌ను సునీల్‌ దియోధర్‌, సోము వీర్రాజు తప్పుపట్టడాన్ని సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఖండించారు.

వైసీపీ ట్వీట్‌లో తప్పేముంది?
మాట్లాడుతున్న మల్లాది విష్ణు

తెలుగు రాని గాడిదలు సునీల్‌ దియోధర్‌, సోము వీర్రాజు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

అజిత్‌సింగ్‌నగర్‌, ఫిబ్రవరి 20: మహా శివరాత్రిని పురస్కరించుకుని వైసీపీ చేసిన ట్వీట్‌ను సునీల్‌ దియోధర్‌, సోము వీర్రాజు తప్పుపట్టడాన్ని సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఖండించారు. రాష్ట్రంలో మతపరమైన రాజకీయాలకు బీజేపీ తెరతీస్తోందని విమర్శించారు. సెంట్రల్‌ నియోజకవర్గంలో షాదీఖానాలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు రాని గాడిదలు సునీల్‌ దియోధర్‌, సోము వీర్రాజు రాష్ట్రంలో మతపరమైన చిచ్చుపెట్టేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అన్నార్తుల ఆకలి తీర్చడమే శివారాధన అని చెబుతూ వైసీపీ చేసిన ట్వీట్‌లో తప్పేముందని ఆయన ప్రశ్నిం చారు. కన్నా లాంటి నేతలు పార్టీని వీడుతుండడంతో సోము వీర్రాజుకు మతి భ్రమించినట్టు ఉందన్నారు. రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపి స్తున్న వ్యక్తి సీఎం జగన్‌ అని, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతపరమైన గొడవలు సృష్టించే పనులు బీజేపీ నేతలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.

Updated Date - 2023-02-21T01:17:02+05:30 IST