Share News

వెలంపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్నాం

ABN , Publish Date - Dec 26 , 2023 | 01:03 AM

‘టీడీపీపైన, చంద్రబాబుపైన విమర్శలు చేసే అర్హత ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకు లేదు. విజయవాడ నగరాభివృద్ధిపై చర్చించేందుకు వెలంపల్లి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం.’’ అని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ సీనియర్‌ నాయకుడు ఎంఎస్‌ బేగ్‌ అన్నారు.

వెలంపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్నాం

దుర్గగుడిలో వెండి సింహాల ప్రతిమలు చోరీ చేసిందెవరు?

చీరలు, కొబ్బరిచిప్పల దందా చేసేదెవరు?

సమాధానం చెప్పాలి: ఎంఎస్‌ బేగ్‌

వన్‌టౌన్‌: ‘‘టీడీపీపైన, చంద్రబాబుపైన విమర్శలు చేసే అర్హత ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకు లేదు. విజయవాడ నగరాభివృద్ధిపై చర్చించేందుకు వెలంపల్లి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం.’’ అని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ సీనియర్‌ నాయకుడు ఎంఎస్‌ బేగ్‌ అన్నారు. సోమవారం టీడీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుర్గగుడిలో మూడు వెండి సింహాల ప్రతిమల చోరీ చేసిందెవరో..చీరలు, కొబ్బరిచిప్పల దందాలు చేసేదెవరో సమాధానం చెప్పాలన్నారు. కరోనా సమయంలో భారీ అవినీతికి పాల్పడి వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేయలేదా? అని ప్రశ్నించారు. రెండు ఫ్లై ఓవర్లు పైనా చర్చిద్దామా? అని ప్రశ్నించారు. యువగళం సభలో పవన్‌కల్యాణ్‌, చంద్రబాబు, లోకేశ్‌ కలయికతో తాడేపల్లి కొంపలో జగన్‌రెడ్డికి భయం పట్టుకుందని, 90 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేందుకు సిద్ధమయ్యాడని తెలిపారు. సరిపల్లె రాధాకృష్ణ, సుకాశి సరిత పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 01:03 AM