ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై అప్రమత్తత అవసరం

ABN , First Publish Date - 2023-07-21T00:54:02+05:30 IST

ఓటర్ల జాబితాలలో మార్పులు, చేర్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ సూచించారు.

ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై అప్రమత్తత అవసరం
కానూరులో ఓటర్ల జాబితాలు పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌

ప్రజలకు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ సూచన

పెనమలూరు, జూలై 20: ఓటర్ల జాబితాలలో మార్పులు, చేర్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ సూచించారు. గురువారం కానూరు 27వ డివిజన్‌లో ఓటర్ల పరిశీలనలో పాల్గొని ప్రజలతో మాట్లాడారు. ఒకే కుటుంబంలోని ఓట్లు ఒకే డోర్‌ నంబరుతో లేకపోతే తమకు తెలియజేయాలని ఆయన సూచించారు. ఒక భవనంలో అన్ని ఓట్లకు ఒకే డోర్‌ నంబరు ఉండేలా చూసుకోవాలని, ఒకే సెక్షన్‌లో ఒకే పోలింగ్‌ స్టేషనులో ఉండాలని లేని పక్షంలో తమ దృష్టికి తేవాలని ఆయన సూచించారు. ఇంటి నం బరు సరిగా లేకున్నా, జీరో ఉన్నా తప్పనిసరిగా టీడీపీ ప్రతినిధులకు తెలపాలని సూచించారు. బహుళ ఎంట్రీలు, చనిపోయిన వారి పేర్లు, శాశ్వతంగా ఇల్లు మారిపోయిన వారి పేర్లు స్థానికుల దృష్టికి వస్తే తమకు వెంటనే సమాచారం అందించి, సహకరించాలని, అలాంటి దొంగ ఓట్లను తొలగించడానికి ఫారం7ను తాము అధికారులకు అందిస్తామని పేర్కొన్నారు. కంఠమనేని పార్థు, రావి రాకేష్‌, వంగూరు పవన్‌, కలవపాముల పవన్‌ ఉన్నారు.

Updated Date - 2023-07-21T00:54:02+05:30 IST