‘వేగ’ంగా..

ABN , First Publish Date - 2023-03-02T00:51:30+05:30 IST

మెరుపు తీగల్లాంటి అమ్మాయిలు ఎదురైతే కనువిందే.. అదే అమ్మాయిలు అదిరిపోయే జ్యూయలరీతో క్యాట్‌వాక్‌ చేస్తే అంతకంటే అందాల విందు ఇంకేముంటుంది. ఈనెల 8న నగరంలో వేగా జ్యుయలర్స్‌ నూతన షోరూమ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం హోటల్‌ నోవాటెల్‌లో ఆభరణాల ఫ్యాషన్‌ షో నిర్వహించారు.

‘వేగ’ంగా..

ప్రారంభోత్సవం సందర్భంగా ఆకట్టుకున్న ఫ్యాషన్‌ షో

విజయవాడ, ఆంధ్రజ్యోతి : మెరుపు తీగల్లాంటి అమ్మాయిలు ఎదురైతే కనువిందే.. అదే అమ్మాయిలు అదిరిపోయే జ్యూయలరీతో క్యాట్‌వాక్‌ చేస్తే అంతకంటే అందాల విందు ఇంకేముంటుంది. ఈనెల 8న నగరంలో వేగా జ్యుయలర్స్‌ నూతన షోరూమ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం హోటల్‌ నోవాటెల్‌లో ఆభరణాల ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ఈ షోలో వజ్రాభరణాలు, టెంపుల్‌ జ్యుయలర్స్‌ను ధరించి మోడల్స్‌ ర్యాంప్‌వాక్‌ చేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్‌ డైరెక్టర్లు వనమా నవీన్‌ కుమార్‌, సుధాకర్‌ మాట్లాడుతూ ఎంజీ రోడ్డులో ఏర్పాటుచేసిన వేగా జ్యుయలర్స్‌ నూతన షోరూంను ఈనెల 8న సినీ నటులు నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌ ప్రారంభి స్తారన్నారు. అంతర్జాతీయ హంగులతో సరికొత్త షోరూంను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అత్యంత తక్కువ తరుగుకే విలువైన ఆభరణాలు ఉన్నాయన్నారు. ఆభరణాల తయారీ నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ షోలో డీఐజీ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T00:51:30+05:30 IST