ఎండ మంటలు.. చిటపట చినుకులు

ABN , First Publish Date - 2023-05-26T00:41:51+05:30 IST

జిల్లాలో విచిత్ర వాతావరణం నెలకొంటోంది. మధ్యాహ్నం వరకూ ఎండ భగభగ మండిపోతుండగా.. సాయంత్రానికి చినుకులతో వాతావరణం చల్లబడుతోంది. గురువారం జిల్లాలో పలు మండలాల్లో ఇదే జరిగింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో గురువారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. సాయంత్రం మాత్రం వాతావరణం చల్లబడింది. పలుచోట్ల గాలివాన, పిడుగుపాట్లకు పంట నష్టం సంభవించింది. వచ్చేనెల 3వ తేదీ వరకూ ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్‌ నుంచి మొదలైన వేడుగాలుల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుంది. ఈ కారణంగా రోహిణి కార్తె ప్రారంభం కాగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఎండ మంటలు.. చిటపట చినుకులు

జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు

పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం... పిడుగుపాట్లు

జిల్లాలో విచిత్ర వాతావరణం నెలకొంటోంది. మధ్యాహ్నం వరకూ ఎండ భగభగ మండిపోతుండగా.. సాయంత్రానికి చినుకులతో వాతావరణం చల్లబడుతోంది. గురువారం జిల్లాలో పలు మండలాల్లో ఇదే జరిగింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో గురువారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. సాయంత్రం మాత్రం వాతావరణం చల్లబడింది. పలుచోట్ల గాలివాన, పిడుగుపాట్లకు పంట నష్టం సంభవించింది. వచ్చేనెల 3వ తేదీ వరకూ ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్‌ నుంచి మొదలైన వేడుగాలుల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుంది. ఈ కారణంగా రోహిణి కార్తె ప్రారంభం కాగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

మచిలీపట్నం, మే 25 : రోహిణి కార్తె ప్రారంభం రోజే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నందివాడలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అవనిగడ్డలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు గురువారం నమోదయ్యాయి. ఊహించని విధంగా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో బలమైన గాలులు వీచి వర్షం కురిసింది. కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. చల్లపల్లి మండలం వెలివోలులో వడగండ్ల వాన కురిసింది. ఘంటసాల మండలం పాపవినాశనంలో బలమైన గాలులకు అరటిచెట్లు కూలిపోయాయి. కరకట్టపై చెట్లు నేలవాలాయి. శుక్రవారం కోస్తాతీరం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన ఓమోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. శుక్రవారం బాపులపాడు, గన్నవరం, గుడివాడ, మొవ్వ, నందివాడ, పామర్రు, పెదపారుపూడి, ఉంగుటూరు ప్రాంతాల్లో 44 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఉయ్యూరు, తోట్లవల్లూరు, పెనమలూరు ఈ ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఈదురుగాలులకు నేలకొరిగిన అరటి పంట

ఘంటసాల : మండల పరిధిలోని పాపవినాశనం గ్రామంలో మురాల సుబ్రహ్మణ్యం సుమారు రెండు ఎకరాల్లో అరటి పంట సాగు చేశాడు. గురువారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు అరటి పంట మొత్తం నేలకొరిగింది. పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావటంతో లాభాలు వస్తాయని ఆశపడిన రైతుకు ఈదురుగాలుల రూపంలో వచ్చిన వర్షంతో పంట మొత్తం నేలవాలిందని రైతు సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశాడు.

శ్రీకాకుళంలోని సోమిశెట్టి బజారులో పావులూరి కాకుళేశ్వరరావు ఇంటి పక్కన ఖాళీ స్థలంలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడి ంది. సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవటంతో ఒక్కసారిగా కొబ్బరి చెట్టు మొవ్వులో పిడుగు పడింది. విజయవాడ కరకట్టపై శ్రీకాకుళం సమీపంలో ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. కొడాలి - శ్రీకాకుళం రహదారిలో సైతం చెట్లు నేలవాలాయి.

మధ్యాహ్నం భగభగలు.. సాయంత్రం గాలివాన

చల్లపల్లి : రోహిణి కార్తె ప్రారంభమైన గురువారమే భానుడి భగభగలకు చల్లపల్లి ప్రజలు అల్లాడిపోయారు. ఉదయం నుంచే ఎండ వేడిమి తీవ్రంగా ఉండగా, మధ్యాహ్నం సమయంలో రోడ్లపై తిరిగేందుకు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు తలెత్తి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చల్లపల్లి మండలం వెలివోలులో వడగండ్లు పడ్డాయి.

Updated Date - 2023-05-26T00:41:51+05:30 IST